పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారుల బాధ్యతా రాహిత్యం చివరకు ఓటర్లకు తిప్పలు తెచ్చిపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉండటంతో.. పేరు, ఊరు, చివరికి ఫొటో కూడా తేడా రావడంతో ఓటర్లు అవస్థలు పడుతున్నారు. తప్పుల సవరణకు అవకాశం ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.