చాల మందికి కాలు ఊపుతూ మాట్లాడే అలవాటు ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు కాలు ఊపుతూ మాట్లాడొద్దు అని అంటుంటారు. ఇక ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు ఇలా సందర్భం ఏదైనా కూర్చున్నప్పుడు కొంతమంది తమకు తెలియకుండానే కాళ్లు ఊపుతూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం టెన్షన్, ఒత్తిడి, ఆదుర్తా, కంగారు అని పరిశోధనల్లో తేలింది. మన శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ అలవాటు మొదలవుతుంది.