నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుపట్టారంటే వీడేలా కనిపించడంలేదు. ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టు కేసుల్లోనే ఆయన మొండితనం అర్థమైంది. హైకోర్టు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు.. ఇలా జరిగింది వ్యవహారం. ఆఖరికి గవర్నర్ వద్ద కూడా పంచాయితీ పెట్టి మరీ అధికారులపై ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. ఇక ఈ వ్యవహారంలో మరో అంకం ఆన్ లైన్ నామినేషన్లు. తొలి దశలో ఆన్ లైన్ నామినేషన్లు ఎందుకు తీసుకోలేదంటూ ఇద్దరు అధికారులకు తలంటారు ఎస్ఈసీ. రెండో దశలో అయినా కచ్చితంగా ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకునే ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.