రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిఘా యాప్ ని కాదని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా మరో యాప్ తయారు చేయించారని, ఎన్నికల ప్రక్రియలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా కొన్నిరోజులు హడావిడి చేసింది. ఎస్ఈసీ సొంత యాప్ వల్ల లేనిపోని వివాదాలు వస్తాయని, టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకే ఈ యాప్ తయారు చేయించారని కూడా నేతలు మండిపడ్డారు. అయితే ఆ తర్వాత యాప్ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. ప్రజా వ్యతిరేకత వల్ల దాన్ని తీసుకురాలేకపోయారని కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చింది.