ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం.. తొలిరోజు నిరాశాజనకంగా సాగింది. ఇంటి వద్దకు వాహనాలు వచ్చినా.. ఆ వీధిలో ఒకేచోట జనం అంతా గుమికూడారు. గతంలో రేషన్ షాపులముందు ఎలా బారులు తీరేవారో.. ఇప్పుడు వాహనం ముందు కూడా అలాగే గుమికూడుతున్నారు. అయితే తొలిరోజు సిగ్నల్ సమస్య, పరికరాలు మొరాయించడంతో లబ్ధిదారులు పడిగాపులు పడ్డారు. అటు అధికారులకు కూడా దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో.. తొలిరోజు రేషన్ పంపిణీ బాలారిష్టాలను ఎదుర్కొంది.