తమ గౌరవాన్ని మంట గలిపేలా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ను కోరిన విషయం తెలిసిందే. 'ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కు రాసిన లేఖలో మాపై మోపిన నిందారోపణలు మాకు తీవ్రమైన బాధను, మానసిక వేదనను కలిగించాయి. ఆ కలతతోనే ఆ లేఖ గురించి మీ దృష్టికి తెస్తున్నాం. లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికలుగా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి' అని వారు పేర్కొన్నారు.కానీ నిమ్మగడ్డ మాత్రం ఏమి ఎరుగనట్లు మళ్లీ తాను చెప్పిందే వినాలంటూ ప్రవర్తిస్తుండటం గమనార్హం..