ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నానినే. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్లిపోతుంటారు. ఏ మాత్రం మొహమాట పడకుండా చంద్రబాబుని పరుష పదజాలంతో దూషిస్తారు. అలాగే నారా లోకేష్, దేవినేని ఉమాలని ఎలా తిడతారో కూడా తెలిసిందే. వీళ్ళ విషయంలో నాని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తిడతారు. అయితే కొడాలి నాని వీరిని తప్పా, మిగతా టీడీపీ నేతలనీ పెద్దగా తిట్టిన సందర్భాలు లేవు.