అలాగే అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ఓ ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారు. దీంతో కొన్ని వివాదాల్లోకి కూడా వెళ్లారు. ఇదే వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారి 2019 ఎన్నికల్లో చింతమనేని ఓటమికి కారణమైంది. కానీ తర్వాత చింతమనేని సైలెంట్ అయ్యారు. అటు వైసీపీ ఎమ్మెల్యే పెద్దగా వర్క్ కూడా చేయడం లేదు. ఈ క్రమంలోనే చింతమనేని దూకుడుగా ఉన్నా సరే పనిచేసేవారు అని, కానీ ఇప్పుడు ఏది లేకుండా పోయిందని దెందులూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.