ఏపీ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో విడదల రజిని కూడా ఒకరు. ఎన్ఆర్ఐగా వచ్చిన రజిని టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు దగ్గర రాజకీయం చూసి, వెంటనే పార్టీ మార్చి, ఆయననే ఓడించి సంచలనం సృష్టించింది. మామూలుగా చిలకలూరిపేటలో టీడీపీకి బలం ఎక్కువ. అందులోనూ ప్రత్తిపాటికి తిరుగులేదు.