పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే పోరాడుతున్నాయి. సాధ్యమైన మేర ఏకగ్రీవాలు చేసుకుని, అన్నీ స్థానాల్లో సత్తా చాటాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంది. అలాగే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి, మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రతిపక్ష టీడీపీ కష్టపడుతుంది. అయితే రాష్ట్రం మొత్తంలో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీకి ఎక్కువ పంచాయితీలు దక్కడం ఖాయమనే చెప్పొచ్చు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే మెజారిటీ స్థానాలని దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.