600మంది ప్రజలు అంతు చిక్కని వ్యాధిబారిన పడి ఆస్పత్రులపాలయితే.. ఇంతవరకు కారణం కనిపెట్టలేక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఏలూరు ఘటనలో పురుగు మందుల ప్రభావం ఉందని ఆ మధ్య తేల్చేసినా.. దానిపై కూడా నిజానిజాలు తేలకపోవడంతో ఇప్పుడు తలపట్టుకుంది. పరిశోధన ఇప్పుడే పూర్తి కాలేదు, ఇంకో ఆర్నెళ్లు ఆగండి అంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు నేతలు, అధికారులు. కారణం ఏంటో బయటపెట్టకుండా ప్రజల్ని సస్పెన్స్ లో పెట్టేశారు.