100 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉన్న వంట నూనెల ధరలు.. లీటరు 150కి చేరువయ్యాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావంతో పామాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిస్థితి గమనిస్తుంటే లీటర్ వంట నూనె రూ.200కి చేరువయ్యే రోజు ఎంతో దూరంలో లేదని తేలిపోతోంది. ఏడాది చివరకి వరకూ ఆగకుండానే లీటర్ రూ.200 కి చేరుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా.