ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతం అవుతోంది ఏపీ. విభజన తర్వాత రెవెన్యూ ఆదాయంలో భారీగా కోతపడగా.. ఇప్పుడు దానికితోడు ఇతర కష్టాలు వెంటాడుతున్నాయి. అటు సాయం చేసేందుకు ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం, పన్నుల వాతలు పెట్టాడనికి మాత్రం ఉత్సాహం చూపిస్తోంది. అగ్రి సెస్ పేరుతో ఏపీపై మరో పిడుగు పడేసింది.