పంచాయతీ ఎన్నికల కోడ్ తో కేవలం మున్సిపాల్టీల్లో మాత్రమే ప్రారంభమైన ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీల పరిధిలో రేషన్ ట్రక్కు డైవర్లు ఆ పని తమ వల్లకాదంటూ చేతులెత్తేస్తున్నారు. వారికిచ్చే జీతం నుంచే సహాయకుడిని నియమించుకోవాలని అధికారులు చెప్పడంతో తొలి రోజు.. కేవలం ఒక్కరే రేషన్ ఇవ్వడానికి బయలుదేరారు. వాహనం ఆపి రేషన్ పంపిణీ చేయడం, మూటలు మోయడం కష్టంగా ఉండటంతో.. ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తరపునే తమకు సహాయకులను ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ నిరసనకు దిగుతున్నారు.