సీఎం జగన్ పై ఓ సీనియర్ ఎమ్మెల్యేకి కోపం ఉంది. ఆ కోపాన్ని పరోక్షంగా ఆయన పంచాయతీ ఎన్నికల్లో చూపెడుతున్నారు. తన దగ్గరకు వచ్చిన పంచాయతీల సమస్యలన్నిటినీ పక్కనపెట్టేస్తున్నారు. స్థానికంగా వైసీపీ నాయకుల్లో ఉన్న విభేదాలను కూడా ఆయన చక్కదిద్దే పని చేయడంలేదని సమాచారం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.