పూర్వ కాలంలో కొంత మంది హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ ఉంటారు. ఇక టిప్పు సుల్తాన్ అలాగే ఓ దేవాలయాన్ని ద్వంసం చేయడానికి బయలుదేరాడు. అయితే కేరళలోని మధూరులో పరమేశ్వరుడి ఆలయం ఉంది. మధురవాహినీ నదీ తీరంలో ఇది కొలువైంది. ఈ గుళ్లో నీలకంఠుడు.. మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఈశ్వరుడే అయినా.. ఎక్కువమంది ఇక్కడ విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడానికి వస్తారు.