కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దేనికీ భయపడిన దాఖలాలు లేవు. పెద్ద నోట్ల రద్దు విషయంతో దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తినా ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రభావితం చేయలేదు. ఓ దశలో బీజేపీ నాయకులు చేసిందే చట్టం, చెప్పిందే వేదం. ప్రతిపక్షాలకు కూడా ప్రశ్నించే సీన్ లేదు, ఇక సామాన్య ప్రజలకు ఎక్కడిది. అలాంటి సమయంలో ఢిల్లీలో రైతులు బీజేపీని వణికిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేపట్టి హస్తినపై పోరు కొనసాగిస్తున్నారు.