తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ సరకులు కావాలంటే అర్జంట్ గా ఆధార్ తో ఫోన్ నెంబర్ లింకు చేసుకోవాలంటూ కండిషన్ పెట్టడం, ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగానే రేషన్ ఇస్తామని చెప్పడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. సామాన్య ప్రజల్లో చాలామందికి ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం కాలేదు. దీంతో వారంతా ఆధార్ కేంద్రాల ముందు బారులు తీరారు. రేషన్ కావాలంటే ఇది కచ్చితంగా చేయాల్సిందేనంటూ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.