పంచాయతీ ఎన్నికలకోసం ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. అయితే ఈ యాప్ పై ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. కోర్టుకి కూడా వెళ్లింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నిఘా యాప్ ఉండగా.. కావాలనే దురుద్దేశంతో ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చారని అధికార పక్షం నేతలు మండిపడుతున్నారు. ఇది కేవలం టీడీపీకి లబ్ధి చేకూరుస్తుందని, కాల్ సెంటర్లో ఉన్నవారి వల్ల టీడీపీకి మేలు జరిగే అవకాశముందని వాదిస్తున్నారు.