సీఎం జగన్ పై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు. అమిత్ షా ని కలసి అన్ని వివరాలు అందించారు. ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఏపీ సీఎం జగన్.. అమిత్ షాను కలిసి ఒకవైపు విషయాలను మాత్రమే చెబుతున్నారని, తామిప్పుడు రెండో కోణం కూడా ఆవిష్కరించామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పి రెండో కోణాన్ని చూపించామని పేర్కొన్నారు. అమరావతి రైతులు, మహిళలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నట్లు తెలిపామన్నారు టీడీపీ నేతలు. తాము చూపిన వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలు తన కార్యాలయంలో ఇవ్వాలని అమిత్ షా సూచించారని చెప్పారు ఎంపీలు.