టీడీపీ నేత పట్టాభిని పరామర్శించిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ఆరోపణలపై అంబటి ఘాటుగా స్పందించారు. చచ్చిన పాము లాంటి చంద్రబాబుపై కక్ష కట్టాల్సిన అవసరం మాకులేదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు. ఇకపోతే నిన్న జరిగిన పట్టాభి పై ఘటన వల్ల బాబు మరో నాటకానికి తెర తీస్తున్నాడు అంటూ మండిపడ్డాడు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి..వాటికి ప్రజలు చూస్తున్నారు.. వాళ్ళే బుద్ది చెప్తారు.. వైసీపీ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు..