చిత్తూరు మండలం చెర్లోపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం సాయంత్రం భాస్కర్‌రెడ్డి తన స్నేహితుడి కుమారుడితో కలిసి కారులో వెళుతుండగా వేంగారెడ్డిపల్లె వద్ద లారీ అడ్డొచ్చింది. దాన్ని తప్పించి పక్కకు వెళ్లబోగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చి భాస్కర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. ఇనుప రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. వారి నుంచి తప్పించుకున్న భాస్కర్‌రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాడి ఇద్దరు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం మీద వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.