ఏపీలో పంచాయితీ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇక మరో రెండు విడతల నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. ఫిబ్రవరి 21తో పంచాయితీ పోరుకు ఫుల్ స్టాప్ పడుతుంది. అయితే పంచాయితీ పోరు ముగియగానే మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది.