కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి తిరుగులేదనే సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలం నుంచి జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా ఫ్యామిలీ హవా ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ఏళ్ల పాటు ఈ నియోజకవర్గాల్లో సేవ చేశారు. ఇక వారు మరణించిన తర్వాత భూమా ఫ్యామిలీలో అఖిలప్రియ లీడ్ తీసుకుంది.