తాడిపత్రి అంటే జేసీ...జేసీ అంటే తాడిపత్రి...ఇందులో ఎలాంటి అనుమానం లేదు. దశాబ్దాల కాలం నుంచి తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డిదే హవా. 1985 నుంచి చూసుకుంటే 2009 వరకు ఇక్కడ వరుసగా 6 సార్లు దివాకర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగవ్వడంతో టీడీపీలోకి వచ్చిన జేసీ 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలాగే తాడిపత్రిలో దివాకర్ సోదరుడు ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు.