ఏపీలో యువ నేతల మధ్య పోరు గట్టిగానే నడుస్తోంది. పాత తరం నాయకులు సైడ్ అవుతుంటే, కొత్త తరం నేతలు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలని యువ నేతలే నడిపిస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల యువ నాయకులు ప్రత్యర్ధులుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. అలా గట్టిగా తలపడుతున్న నేతల్లో శింగనమల నియోజకవర్గానికి చెందిన యువ నేతలు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణిలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో శ్రావణిపై పద్మావతి భారీ మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఈ 20 నెలల కాలంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పద్మావతికి బాగా ప్లస్ అవుతున్నాయి.