చిత్తూరులో రెండో విడత నామినేషన్లు పూర్తి అయిన గొడవలు మాత్రం జరుగుతున్నాయి. వైసీపీ నేతలు బెదిరింపులకు దిగినట్లు తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ అనూష రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నామినేషన్ వేస్తే ఎర్రచందనం దొంగలని కేసులు పెడతామని బెదిరించారని తెలిపారు. నామినేషన్లు వేయనీయకుండా పోలీసులే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని అనుష రెడ్డి ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గం పులివెందుల కంటే ఘోరంగా ఉందన్నారు. ఈ విషయం రాజకీయ చర్చలకు దారి తీసింది.. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు..