ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరుని అందరూ వ్యతిరేకిస్తున్నా ఆయనలో ఏమాత్రం చలనం లేదని ఎద్దేవా చేశారు వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. సకల పాపాలకు కేంద్ర బిందువైన చంద్రబాబు మాటలను ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తి ఎలా నమ్ముతున్నాడో అర్ధం కావట్లేదని అన్నారామె. నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు మైకంలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుని నమ్మిన వారెవరూ బాగుపడలేదని, నిమ్మగడ్డ విషయంలో కూడా అది రుజువు అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనైన నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు.