వైసీపీ ప్రభుత్వం కొత్త లెక్కలు బయటకు తీసింది. పోలీసు రికార్డులంటూ.. కొత్త చిట్టా విప్పింది. ఆ చిట్టాలో ఆలయాల పాపాలన్నీ టీడీపీ ఖాతాలోకి నెట్టేసింది. టీడీపీ హయాంలోనే అత్యథికంగా ఆలయాలపై దాడులు జరిగాయని వివరించింది. అదే క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ దాడుల సంఖ్య తగ్గిందని, పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపింది.