చంద్రబాబు పౌరుషానికి పోయి ఏకగ్రీవాల విషయంలో చేసిన వ్యాఖ్యలు స్థానిక టీడీపీ నేతలకు తలనొప్పిగా మారాయి. అసలే గ్రామాల్లో టీడీపీకి సంఖ్యా బలం, ఆర్థిక బలం అంతంతమాత్రంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఖర్చుపెట్టి ఓడిపోయిన నేతలంతా సైలెంట్ గా ఉన్నారు. ఈ దశలో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్న చంద్రబాబు, ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, ప్రతి చోటా తమ అభ్యర్థుల్ని బరిలో దింపాలని నేతలకు ఆదేశాలిచ్చారు. అధినేత ఆదేశాల ప్రకారం అభ్యర్థుల వేటలో పడిన నేతలంతా.. వారికి ఆర్థిక సాయం చేసి మరీ బరిలో దింపుతున్నారు. తీరా తాము అప్పులపాలవుతున్నారు.