ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎంజగన్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు.. 28 మంది వైకాపా ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభం? 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. వేలాది మంది ప్రత్యక్షంగా,లక్షలాదిమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మౌనం దాల్చడం అవమానకరం. ఇలా ఒక్కో పరిశ్రమా అమ్మేయడం,అడవులు-కొండల్ని కబ్జా చేయడమేనా పరిపాలనా అంటూ లోకేశ్ బాబు ప్రశ్నలు కురిపించారు.