25కు 25 ఎంపీలు ఇవ్వండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చిపెడతా...ఇది జగన్ 2019 ఎన్నికల ముందు మాట్లాడిన మాట. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా జగన్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడారు. ఇక జగన్ పోరాటానికి ఫలితంగా 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు 25కు 22 మంది ఎంపీలని ఇచ్చారు. ఇక ఇన్ని ఎంపీలు ఇచ్చాక జగన్ ప్రత్యేక హోదా తెచ్చేస్తారని ప్రజలు అనుకున్నారు.