తనకి సహకరించని అధికారులందర్నీ సస్పెండ్ చేస్తున్నారని, అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ నిన్న మొన్నటి వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అధికార పక్షం ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు అదే అధికారుల్ని వైసీపీ పెద్దలు బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ మాట విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అధికారుల్ని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏకగ్రీవాల విషయంలో రిటర్నింగ్ అధికారులు పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించాలని అన్నారు. ఏ అధికారి కూడా నిమ్మగడ్డను గౌరవించాల్సిన అవసరం లేదని అన్నారు.