నెల్లూరు జిల్లాలో వైసీపీ డిఫెన్స్ లో పడినట్టు తెలుస్తోంది. తొలి విడత ఎన్నికలు జరగబోతున్న కావలి డిజవన్ లో వైసీపీకి ఎక్కువ ఏకగ్రీవాలు రాకపోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు. కావలి డివిజన్లో కనీసం 70 స్థానాలు ఏకగ్రీవం అవుతాయని అనుకుంటే కేవలం 25 స్థానాలు మాత్రమే పోటీ లేకుండా వన్ సైడ్ అయ్యాయి. అయితే వీటిలో టీడీపీ వాటా కూడా ఉంది. అన్నీ కలుపుకొంటే.. 20లోపే వైసీపీకి దఖలు పడ్డాయి. దీంతో స్థానిక నేతలు డీలా పడ్డారు. తొలి విడతలోనే తమకు మంచి శకునం కనిపించలేదని అంటున్నారు. కావలి డివిజన్లో హోరా హోరీగా జరిగే పోటీలో నెగ్గాలంటే వైసీపీకి తలకు మించిన భారంలా మారుతోంది.