విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. చివరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకోసం కట్టుబడి ఉన్నామని చెబుతోంది. మరి ఏపీ సీఎం జగన్ ఇంతవరకూ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ జగన్ సరే.. కనీసం విశాఖలోని వైసీపీ ప్రజా ప్రతినిధులైనా దీనిపై స్పందించాలి కదా. విశాఖకు రాజధాని తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తామంటూ కబుర్లు చెబుతున్న నేతలు.. కీలకమైన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ కేంద్రం అంటుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..?