కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ దగ్గర మరణాల రేటు తక్కువగా ఉందని, తమ రాష్ట్రంలో కోలుకుని ఇంటికెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వాలు ప్రచారం చేసుకున్నాయి. రికార్డులకోసం పోటీ పడ్డాయి. ఇక ఇప్పుడు కొవిడ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో పోటీ మొదలైంది. వ్యాక్సినేషన్లో భారత్ దూసుకుపోతోందని ప్రకటించింది కేంద్రం. ప్రపంచ వ్యాప్తంగా 11.9కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. అందులో 50లక్షలమంది భారతీయులేనంటున్నారు.