దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ కి వ్యాక్సిన అంటూ కొన్నిచోట్ల మందులు వాడుతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా, ఎవరికీ ఈ వ్యాక్సిన్ వాడకం కోసం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. మనదేశంతోపాటు, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా బర్డ్ ఫ్లూను ఎదుర్కొనే వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వలేదని పేర్కొంది.బర్డ్ ఫ్లూ నిర్మూలనకు వ్యాక్సిన్ పరిష్కారం కాదనే విషయాన్ని వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ కూడా సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఈమేరకు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పాడి, పశుసంవర్థక శాఖ మంత్రి బదులిచ్చారు.