చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎస్ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదని చంద్ర బాబు జాడలోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తారని నిప్పులు చెరిగారు.నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాల్సిందే. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. నిమ్మగడ్డ తనను తాను రాష్ట్రపతి అనుకుంటున్నారు. ఆయన చెప్పింది తల ఆడించడానికి మేము చేతకాని వాళ్ళము కాదు.. మంత్రి గృహ నిర్భందం పై వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..