మనిషి కన్నా ఎక్కువ విశ్వాసం కుక్కకి ఉంటాదని అందరు అంటారు. అందుకే చాల మంది కుక్కలను పెంచుకున్నారు. ఇక వాటిని తమ పిల్లలతో సమానంగా చూస్తుంటారు. ఇక రోజుల్లో కుక్కలపై చూపించినంత ప్రేమను మనుషులపై చూపించడం లేదు. అందుకేనేమో శునకానికి విశ్వసం ఎక్కువ. యజమాని పట్ల కుక్క చూపించే విశ్వాసం మరోసారి రుజువైంది. గుండెపోటుకు గురైన వ్యక్తిని ఓ శునకం కాపాడింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది.