పోలీస్ డిపార్ట్ మెంట్ లో వీక్లీ ఆఫ్ లు ఉండవు. ఒకవేళ ఉన్నాయని అనుకున్నా అది వారి భ్రమే. అలాంటి పద్ధతికి చెక్ పెట్టాలంటూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ పోలీసులకు వారంతపు సెలవుల్ని తప్పనిసరి చేశారు. కచ్చితంగా సెలవలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే ఆ ఆదేశాలు అమలులోకి వచ్చి, పోలీసులు సెలవల్ని వాడుకునే లోపే కరోనా కష్టకాలం వచ్చి పడింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే బిరుదు ఇచ్చేసి వారి సెలవల్ని రద్దు చేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్యూటీలు పడ్డాయి, ఇప్పుడు ఎన్నికల విధులు.. ఇలా ఏపీ పోలీసులకు సెలవలు లేకుండా పోయాయి.