నిమ్మగడ్డ ఆదేశాలు పాటిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అలా హెచ్చరించే అధికారం మీకెక్కడిది అంటూ.. నిమ్మగడ్డ, మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై ఇల్లు దాటకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల్లో ప్రెస్ మీట్ పెట్టకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే ఆ ఆదేశాలు తనకింకా అందలేదని డీజీపీ చెప్పిన గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి మరోసారి నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. దీంతో మరోసారి షాకవడం నిమ్మగడ్డ వంతయింది. ఈ ప్రెస్ మీట్ పై కూడా వివరణ కోరాలని, ఆయనపై మరింత కఠిన చర్యలకు సిద్ధం కాబోతున్నారట నిమ్మగడ్డ.