తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకీ తీసికట్టుగా తయారవుతుందన్న మాట వాస్తవం. నాయకులపై పార్టీ పట్టు కోల్పోతోంది. తొలినాళ్లలో కేసీఆర్ గీత జవదాటనివారు కూడా.. ఇప్పుడు ఎవరి ఇష్టానికి వారు మాట్లాడుతున్నారు. అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు, ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. దీంతో కేసీఆర్ పార్టీపై మరోసారి దృష్టిపెట్టారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ నిలబెట్టిన, ఆయన ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేందుకు సిద్ధమయ్యారు.