ఆ ఊరిలో సర్పంచ్ పదవి జనరల్ మహిళలకు కేటాయించారు. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి ఆ పదవి ఇవ్వాలని ఓ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఊరి ప్రజల్నీ ఒప్పించింది. ఏకగ్రీవంకోసం భారీగానే ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. తీరా నామినేషన్ వేసే సమయానికి అసలు విషయం బయటపడింది. 2019 ఓటర్ల లిస్ట్ ప్రకారం జాబితాలో కోడలి పేరు లేదు. ఓటు హక్కు లేకుండా అదే గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం కుదరదు. దీంతో ఆ కొత్త కోడలు సర్పంచ్ అవకాశం కోల్పోయింది.