టీవీ ఆన్ చేస్తే వెంటనే ఆ ఫొటో ప్రత్యక్షం అవుతుంది. గతంలో ఇలాంటి ఏర్పాటు లేకపోయినా.. ఇప్పుడు కొత్తగా ఏపీలో ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవారి టీవీల్లో సీఎం జగన్ బొమ్మ ప్రత్యక్షం అవుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ కి విరుద్దంగా ఇలా ప్రభుత్వం తరపున వైసీపీకి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం జగన్ ఫొటో రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. ఏపీలో 10లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయని, వాటన్నిటిలో టీవీ ఆన్ చేయగానే.. డిఫాల్ట్ గా కింద సీఎం ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న టీవీల్లో సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.