మనకు తెలియకుండా మనం సర్పంచ్ గా ఎన్నికయ్యామంటూ అధికారులు మన దగ్గరకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా..? నెల్లూరు జిల్లాలో సరిగ్గా అదే జరిగింది. పంచాయతీ ఎన్నికల గురించి తెలియదు, నామినేషన్ వేయలేదు, అయినా ఆయన సర్పంచ్ గా ఎన్నికయ్యారు. చెన్నైలో కూలి పనులు చేసుకుంటున్న వ్యక్తిని పిలిపించి నువ్వే సర్పంచివి అంటూ ధృవీకరణ పత్రం చేతిలో పెట్టారు అధికారులు. దాంతో షాకవడం అతనివంతు అయింది.