ఆమెకు పదవులపై ఆశ లేదు, అంతకంటే గొప్ప ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన అనుభవం ఆమెకు ఉంది. అందుకే ఎన్నికలకు, రాజకీయాలకు ఆమె స్వతహాగా దూరం. కానీ తన కుటుంబంలో జరిగిన ఓ పరిణామం ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచేలా చేసింది. 82ఏళ్ల వయసులో నామినేషన్ వేసేలా పరిస్థితులు ఆమెను ముందుకు నడిపించాయి.