మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా నిమ్మగడ్డ సహనం కోల్పోలేదు. ఆ విషయంలో మీడియాతో మాట్లాడొద్దనే ఆంక్షను మాత్రం యథావిధిగా ఉంచినందుకు సంతోషపడ్డారు. అయితే తనకు బాగా కావాల్సిన వ్యక్తిని ఏపీ ప్రభుత్వం కూరలో కరివేపాకులా తీసి పక్కనపెట్టడంతో ఆయన కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఏకంగా బదిలీలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసే వరకు ఆయనకు నిద్రపట్టలేదు.