పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇల్లు దాటి బయటకు రావద్దని, మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడం, ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడం కూడా తెలిసిందే. అయితే ఆంక్షలు ఎత్తివేసినా కూడా మంత్రి పెద్దిరెడ్డికి సంతోషం లేకుండా పోయింది. మీడియాతో మాట్లాడొద్దు అనే ఆదేశాలు మాత్రం ఆయన తూచా తప్పకుండా పాటించాల్సిందేనని అర్థమవుతోంది. కేవలం ఇల్లుదాటి కదలొద్దు అనే విషయంపైనే కోర్టు ఎస్ఈసీ ఆంక్షలను రద్దు చేసింది. దీంతో ఆదివారం అంతా మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు దూరంగా ఉన్నారు.