తెలంగాణలో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా ఎక్సైజ్ శాఖ నుండి వస్తుంది. ఇక ఎక్సైజ్ శాఖ నుండి ఆదాయం అటూ ఇటూ తేడాగా వచ్చినా.. ఎక్సైజ్ శాఖ మాత్రం ఆదాయాన్ని పెంచుకుంటుందే తప్ప తగ్గడం లేదు. ఈ తరణంలో కొత్తగా ఏర్పాటయ్యే బార్ల కోసం అవకాశవాదులు భారీ స్థాయిలో దరఖాస్తులు చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్తగా బార్లను ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు అత్యంత ఆసక్తి చూపుతున్నారు.