సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా అనిపిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో ఆయన బాగా పరిణతి చెందిన నాయకుడిలాగా ఆలోచిస్తారు. మూడు రాజధానుల విషయంలో జగన్ నిర్ణయాన్ని సమర్థించేవారు ఉన్నట్టే, విభేదించేవారు కూడా ఉన్నారు. అదే సమయంలో కోర్టు కేసులతో మూడు రాజధానుల నిర్ణయం, కార్యాలయాల తరలింపు హోల్డ్ లో పడిపోయింది. అయితే విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఉత్తరాంధ్రవాసులకు రాజధాని ఆశల్ని సజీవంగా ఉంచాయి.